4213) కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు


** TELUGU LYRICS **

కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు (2)
నీ కృపలో నన్ను నిలుపుము (2)
నీ కృపతోనే నను నింపుము (2)  
||కృపా||

నీ కృప ఎంతో మహోన్నతము
ఆకాశము కంటే ఎత్తైయినది (2)
నీ సత్యం అత్యున్నతము
మేఘములంత ఎత్తున్నది (2) 
||కృపా||

నీ కృప జీవముకంటే ఉత్తమము
నీ కృప లేనిదే బ్రతుకలెను (2)
నీ కృపా బాహుళ్యంమే నను
నీలో నివసింప చేసినది (2)
||కృపా||

నీ కృపలను నిత్యము తలచి
నీ సత్యములో జీవింతును (2)
నీ కృపాతిశయములనే
నిత్యము నేను కీర్తింతును (2)
||కృపా||

ఈ లోకము ఆశాశ్వతము
నీదు కృపయే నిరంతరము (2)
లోకమంతా దూషించినా
నీ కృప నాకంటే చాలు (2)
||కృపా||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------