4251) అదిగదిగో పరలోకము నుండి దిగివచ్చే వధువు సంఘము


** TELUGU LYRICS **

అదిగదిగో పరలోకము నుండి దిగివచ్చే వధువు సంఘము 
వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకొన్నది

అల్ఫా ఒమేగయైన - నా ప్రాణప్రియునికి
నిలువెల్ల నివేదించి - మైమరతునే
నా యేసురాజుతో - లయము కాని రాజ్యములో
ప్రవేశింతునే - పరిపూర్ణమైన పరిశుద్ధులతో
||అదిగదిగో||

కళ్యాణ రాగాలు - ఆత్మీయ క్షేమాలు
తలపోయుచూనే - పరవసింతునే
రాజాధిరాజుతో - స్వప్నాల సౌధములో
విహరింతునే - నిర్మలమైన వస్త్రధారినై 
|| అదిగదిగో||

జయించినవాడై సర్వాధికారియై
సింహాసనాసీనుడై - నను చేర్చుకొనును
సీయోను రాజుతో - రాత్రిలేని రాజ్యములో
ఆరాధింతునే - వేవేల దూతల పరివారముతో
|| అదిగదిగో||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------