** TELUGU LYRICS **
- యం. క్రిష్టయ్య
నా ప్రియమైన సోదరుడా - ప్రభవు నందు కుమారుడా
మన ప్రభు ఏసు కృపచేత - ఆత్మలో బలము పొందు
మన ప్రభు ఏసు కృపచేత - ఆత్మలో బలము పొందు
1. నావలన విన్నవియు - ప్రభువు నీకు నేర్పినవి
నమ్మకమైన మనుష్యులకు - ప్రభువు సేవలో అప్పగించు
నమ్మకమైన మనుష్యులకు - ప్రభువు సేవలో అప్పగించు
2. క్రీస్తు మంచి సైనికుని వలె - క్రీస్తు శ్రమలను అనుభవించి
క్రీస్తు రాజు ఆనందంలో - పాలుపొందుము యవ్వనుడా
క్రీస్తు రాజు ఆనందంలో - పాలుపొందుము యవ్వనుడా
3. దేవుని సేవా పోరాటంలో - జెట్టివాని వలె పోరాడి .
దేవుడు జూపిన గురి చేరి - దేవుని బహుమతి పొందుమయా
దేవుడు జూపిన గురి చేరి - దేవుని బహుమతి పొందుమయా
4. పాటు పడిన కర్షకుని వలె - ప్రయాసపడి పనిచేసి నీవు
ప్రథమ ఫలమగు ఆత్మలనే - ప్రభువు సేవలో పొందుమయా దతే.
ప్రథమ ఫలమగు ఆత్మలనే - ప్రభువు సేవలో పొందుమయా దతే.
5. దేవుని ఎదుట యోగ్యునిగా - సత్యవాక్యము సరిగ పట్టి
జడియక జంకక ధైర్యముతో - దైవ సేవలో కొనసాగుము
జడియక జంకక ధైర్యముతో - దైవ సేవలో కొనసాగుము
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------