3865) ఎన్నాళ్లో ఉండవమ్మ నీ కంటిలోని కన్నీరు


** TELUGU LYRICS **

ఎన్నాళ్లో ఉండవమ్మ నీ కంటిలోని కన్నీరు
కొన్నాళ్ళే ఓర్చుకుంటే
నీ యింట కురియు పన్నీరు (2)
నీ శ్రమను ఎరిగియున్న దేవుడు
ఏ క్షణము నిన్ను విడిచిపెట్టాడు
ఒంటరివి కావు నీవు ఎన్నాడు 
||ఎన్నాళ్ళో||

శ్రమకు ఫలము దొరకక మనస్సు గాయమాయేనా
గతపు భయము తోలగక - బలము విగీపోయేన
ఓటమి చీకటై నిన్ను కమ్మివేసినా
 (2)
తేలిక చేయును
తేలిక చేయును భారం ఎదైన
ధైర్యం నీయందు కలిగించకుండునా
||ఎన్నాళ్ళో||

స్వరము శృతిలో పలకక గళము మూగబోయిన
పదము సరిగ కుదరక కలము జారిపోయినా
ప్రశ్నలు తీవ్రమై నిన్ను కూలద్రోసినా (2)
సాధ్యము చేయును
సాధ్యము చేయును కార్యం ఎదైనా
గీతం నీ నోట పలికించకుందునా
||ఎన్నాళ్ళో||

ఎవరు పలకరించక బ్రతుకు ఘోర మయెనా
అడుగు సహకరించక పరుగు ఆగిపోయినా
ఆశలు శున్యమై  నిన్ను కృంగదీసెనా (2)
తిన్నగా చేయును
తిన్నగా చేయును మార్గము ఎదైనా
గమ్యం నీ ముందు కనిపించకుండునా
||ఎన్నాళ్ళో||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------