3694) సహాయము లేనపుడు కాపాడావు నిరీక్షణ లేనపుడు బలపరిచావు


** TELUGU LYRICS **

సహాయము లేనపుడు కాపాడావు 
నిరీక్షణ లేనపుడు బలపరిచావు (2)
నీ నామములో
నీ సన్నిధిలో
 (2)

నాకు విడుదల దొరికినది
నాకు జీవo కలిగినది
నాకు స్వస్థత దొరికినది
విమోచనా కలిగినది
దేవా నా యేసయ్య 
స్నేహితుడా నా సహయుడా
 (2)

గడచిన కాలము కాపాడావు
నీ కృప చేతనే నను రక్షించావు
 (2)
నీ వాక్యములో
నీ ధ్యానములో
 (2)

నిలిచే భాగ్యమియ్యుము
ప్రార్థించే మనస్సునియ్యుము
క్షమియించే హృదయమియ్యుము
నీదు సాక్షిగా బ్రతికేదను
దేవా నా యేసయ్య

స్నేహితుడా నా సహాయుడా
 (2)
సహాయము లేనపుడు కాపాడావు
నిరీక్షణ లేనపుడు బలపరిచావు
 (2)

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------