3696) కృపగల దైవమా కరుణించే దైవమా

    
    
** TELUGU LYRICS **

    కృపగల దైవమా - కరుణించే దైవమా
    నీ కృపలో నన్ను దాచినావయ్య (2)
    యేసయ్య నీకే వందనం - యేసయ్య నీకే స్తోత్రము- 
    యేసయ్య నీకే మహిమ నిరంతరం
 (2)
    ఆరాధన నీకే యేసయ్యా
 (4)

1. కష్టనష్టాల సంద్రంలో - వ్యాధి వేదన బాధలలో - 
    కన్నతండ్రివై నీవే నాకు తోడైయుంటివయ్యా (2)
    నూతన బలమును ఇచ్చి - నూతన మనసును ఇచ్చి - 
    నీ ఆత్మ శక్తితో నింపిన యేసయ్య (2)
    || యేసయ్య నీకే వందనం ||

2.  అంధకార లోయలలో - అలలు ఉన్న అలసటలో - 
    ప్రేమ కొదువైన లోకంలో నా ప్రార్ధన వింటివయ్యా (2)
    నూతన సన్నిధిని ఇచ్చి - నూతన జీవితం ఇచ్చి - 
    నీ ఆత్మ శక్తితో నింపిన యేసయ్య (2)
    || యేసయ్య నీకే వందనం||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------