420) లెక్కింప శక్యము కావు దేవా నీ కార్యములు

** TELUGU LYRICS **

    లెక్కింప శక్యము కావు దేవా నీ కార్యములు
    నా హృదయము పాడుచు పొగడెను దేవా నీ నామమును (2)
    నిదురెరుగక నను కాయుచు 
    నీతి సూర్యుడ నను మరువక నను కాచినావు నీవు ఎల్లపుడు 

1.  కష్టములె కదలక నన్ను కాల్చుకొనితిన్నవిలే
    శోధనలే సంద్రంలా నాపైకి ఎగసెనులే (2)
    నా కన్నీళ్లు తుడిచావు- నా కాపరి నీవై నిలిచావూ (2) 
    ||లెక్కింప|| 

2.  శాపముల భారముతో బ్రతుకె బరువాయేనులే
    గమ్యమే తెలియని పయనం పాదములె పరుగెడులే (2)
    నాకు తోడై నిలిచావు నీ కౌగిలిలో నను దాచావూ (2)
    ||లెక్కింప|| 

3.  సర్వము కోల్పోయినే జీవత్సవమైయుంటిని
    వీడని కన్నీళ్లతో మూల్గుచు నేనుండగ (2)
    నాకు తోడై నిలిచావు నీ నీడలో నను దాచావూ (2)
    ||లెక్కింప|| 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------