** TELUGU LYRICS **
యౌవనుడా సంతోషపడుమా - యౌవన కాలమున
అ ప: అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును నిన్ను - జ్ఞప్తినుంచుకో
అ ప: అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును నిన్ను - జ్ఞప్తినుంచుకో
1. లేత వయస్సు నడి ప్రాయమును - గతించిపోవునవి
గనుక నీదు హృదయములో - వ్యాకులమును
తొలగించుకొనుము - యువకుడా వినుము
గనుక నీదు హృదయములో - వ్యాకులమును
తొలగించుకొనుము - యువకుడా వినుము
2. దుర్దినములు రాబోకముందే - వీటి యందిపుడు
సంతోషము లేదనియెడు సంవత్సరములు
రాబోకముందే - చెడుగును విడుమా
సంతోషము లేదనియెడు సంవత్సరములు
రాబోకముందే - చెడుగును విడుమా
3. పశ్చాత్తాపమున పాపములను - ఒప్పుకొనుచు నేడే
రక్షణార్థము - రక్షకుడేసును
రయమున క్షమాపణ వేడిన - రక్షణ నీదే
రక్షణార్థము - రక్షకుడేసును
రయమున క్షమాపణ వేడిన - రక్షణ నీదే
4. మన్నయినది వెనుకటివలెనే - మంటిలో కలియున్
ఆత్మ దాని దయ చేసిన
దేవుని సన్నిధికి మరల - వెళ్ళును యౌవనుడా
ఆత్మ దాని దయ చేసిన
దేవుని సన్నిధికి మరల - వెళ్ళును యౌవనుడా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------