2773) యేసుని రాజ్యము అది నిశ్చలమైనది

** TELUGU LYRICS **
    
    యేసుని రాజ్యము అది నిశ్చలమైనది (2)
    తరతరములకు యుగయుగములకు మార్పులేనిది
    పరిశుద్ధులందరు స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది (2)

1.  ప్రకాశమైన రాజ్యము - పరిశుద్ధులకె స్థానము (2)
    కన్నీరు లేని రాజ్యము - మరణము లేని రాజ్యము (2)
    ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే (2)

2.  భోజనపానము కాని ఉత్తమమైన రాజ్యము - నీతి సమాధాన రాజ్యము
    సూర్యచంద్రులు లేని రాజ్యము
    ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే

3.  జయించు వారిదే రాజ్యము - నీతిమంతులదే కిరీటము
    జీవజలనది పారును - దేవుడే వాటిని త్రాగనిచ్చును
    ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే

4.  శాపము లేని రాజ్యము - గొర్రెపిల్ల ఉండు రాజ్యము
    మన ప్రభువే ప్రకాశించును - యుగయుగములు పరిపాలించున్
    ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే

5.  క్రీస్తుని రాక ఏ క్షణమో - ఎదుర్కొన నీవు సంసిద్ధమా
    నేడే యేసుని స్వీకరించు - క్రీస్తుకై నీవు జీవించుమా
    ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లపుడు సంతోషమే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------