2750) యేసునాధుని సిలువపైని వేసి శ్రమఁబొదించినది

** TELUGU LYRICS **

    యేసునాధుని సిలువపైని వేసి శ్రమఁబొదించినది నా దోసమే
    దుస్సహ వాసమే 
    ||యేసు||

1.  కంటక కిరీట మౌదల నంటగొట్టించినది నాచెడు తలఁపులే
    పాపపు పలుకులే
    ||యేసు||

2.  మృదుకరంబుల మేకులందింపి నదితలఁప నా హస్తకృత కా ర్యంబులే
    దుష్క ర్మంబులే
    ||యేసు||

3.  పాదయుగమున నాటిచీలలు బాధ నొందించినది నా చెడు నడకలే
    దోసపు పడకలే
    ||యేసు||

4.  దాహముం గొనఁజేదు చిరకను ద్రావదలఁచినది మధుపానా సక్తియే
    యందను రక్తియే
    ||యేసు||

5.  హెచ్చుగ లోహిత పతనముగఁ గ్రుచ్చిన కుంతంబు నా పా పేచ్ఛలే
    హృదయదు రేచ్ఛలే
    ||యేసు||

6.  పావనగాత్రంబు క్షతమయ మై వెతలపాల్జేసినది నా దేహమే యఘ
    సం దోహమే
    ||యేసు||

7.  దీనిఁగని నా మానసాబ్జము లోని కలుషము దూరపర్చక నడుతునా
    ధారుణిఁ గడుతు నా
    ||యేసు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------