2606) యేసు నిన్ను జూతు నిందుదేటగా

** TELUGU LYRICS **

1.  యేసు నిన్ను జూతు నిందుదేటగా
    అగోచరార్థముల్ నే ముట్టుదున్
    కృపన్ నేబట్టుకొందు గట్టిగా
    నీ మీద వేయుదున్ నా భారము

2.  నే దైవాహార మిందె తిందును
    ఆత్మీయ ద్రాక్షాపాత్ర త్రాగుదున్
    భూ భారముల్ నేబార వేయుదున్
    క్షేమా సౌక్యంబు గల్గుకొత్తగా

3.  సంగీత భోజనాల కాలము
    ప్రభుండు నాకై బల్ల వేసెను
    విందారగించుచున్ నీతోడినా
    మాధుర్య స్వల్ప మైత్రిన్ బెంచుదున్

4.  సాయంబీవే వేరే నాకెందుకు?
    వేరే చేయి మీద నాను కొనను
    ప్రభూ నిజంబుగా నీదే చాలున్
    నీ శక్తిలోనే నా బలముండున్

5.  పాపంబు నాది నీతి నీదేగా
    నేరంబు నాది శుద్ధి నీదేగా
    నీ రక్తనీతియే నా వస్త్రముల్
    నా కాశ్రయంబు శాంతిస్థితులు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------