2600) యేసు నామమే పావనము మాకు యేసు గద నిత్య జీవనము

** TELUGU LYRICS **

    యేసు నామమే పావనము మాకు యేసు గద నిత్య జీవనము దాస
    జన హృద్వికాసమైయెల్ల దోసములకు వి నాశకరమైన 
    ||యేసు||

1.  సాధు మానసోల్లాసములు యేసు నాధు గుణ చిద్విలాసములు బోధఁ
    గొను వారి బాధ వెడలించి మాధుర్యమగు ముక్తి సాధనములిచ్చు.
    ||యేసు||

2.  భక్త జన లోక పూజ్యములు రక్త సిక్త పాదపయోజములు ముక్త
    రాజ్యాభి షిక్తుఁడౌ సర్వ శక్తి యుతుఁడైన సామియగు క్రీస్తు 
    ||యేసు||

3.  దీన జన నిత్య తోషణము సిల్వ మ్రాని ప్రభు మృత్యు ఘోషణము
    పానకము జుంటి తేనియల స్వాదు వీనులను గ్రోలు మానవుల కెల్ల
    ||యేసు||

4.  పాపులకు మంచి పక్షములు ముక్తిఁ జూపు క్రీస్తు కటాక్షములు పాప
    సందోహ కూపమునఁ గూలు కాపురుషు నన్నుఁగాచుకొనిప్రోచు 
    ||యేసు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------