2594) యేసు నామం అన్నిటికన్న శ్రేష్ఠమైన నామం

** TELUGU LYRICS **

    యేసు నామం అన్నిటికన్న
    శ్రేష్ఠమైన నామం
    యేసు స్మరణే ఎప్పటికైనా
    అభయము ఆధారమే
    పాడుదాం చాటుదాం
    యేసు జన్మ వార్తను
    చూపుదాం నిలుపుదాం (2)
    ప్రభు ప్రేమ సువార్తను 
    ||యేసునామం||

1.  దేవుడే మనిషిగ పుట్టెను
    దాసునిగా వచ్చెను ఇదియే ఆశ్చర్యము
    ప్రభువే మన పాపము కొరకై
( 2)
    భువికరుదెంచెను
    చూడు ఎంత ప్రేమయో
    కృపగల దేవుడు యేసయ్యా
    దయగల దేవుడు మెస్సయ్యా 
(2)
    ||పాడుదాం|| ||యేసు నామం||

2.  గొల్లలు జ్ఞానులు చూచిరి
    స్తుతులర్పించిరి సాక్షులుగా నిలిచిరీ
    యేసునీ ప్రేమను తెల్పుదాం 
(2)
    లోకాన చాటుదాం
    సాక్షులుగా బ్రతుకుదాం
    ఇదేగా క్రిస్ట్మస్ ఆనందం
    ఇదేగా క్రిస్ట్మస్ సంతోషం 
(2)
    ||ఆడుదాం|| ||యేసు నామం||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------