2592) యేసు నాథ కథా సుధా రస మిదిగో పానముఁ జేయరే దోసకారి

** TELUGU LYRICS **

    యేసు నాథ కథా సుధా రస మిదిగో పానముఁ జేయరే దోసకారి
    జనంబులారా దురిత భవముల బాయరే 
    ||యేసు||

1.  ఇహపరంబు లెవనిచే సృజి యింపఁబడియెనొ చూడరే అసహహ యా
    విభుఁ డవతరించెను అతని గుణములఁ బాడరే
    ||యేసు||

2.  దురిత భరితుల దుష్ట చరితుల నరయ వచ్చెను జూడరే స్థిరముగామది
    నమ్మి యా ప్రభు కరుణ మదిఁ గొనియాడరే
    ||యేసు||

3.  పనికిమాలిన వేలుపుల దెస పరుగు లెత్తుట మానరే తనువు మీ
    కొఱ కిచ్చు క్రీస్తుని దయకుఁ బాత్రతఁ బూనరే
    ||యేసు||

4.  మరణ బలి రక్తమున మన యం దఱిని బ్రోవను వచ్చెను కరుణతోఁ
    బాపులఁ బిలుచు గురు దరికిఁబోవుద మిచ్ఛను
    ||యేసు||

5.  పరమతత్వ విధాన బోధలు బాగుగఁ బ్రకటించెను చిరసుఖాస్పద
    పదముఁ గోరిన జీవులకు వినిపించెను
    ||యేసు||

6.  మరణ మొందిన కొందఱికిఁ దా మరలఁ బ్రాణము లిచ్చెను వర
    మహాద్భుత కార్యముల ని ద్ధర ననేక మొనర్చెను
    ||యేసు||

7.  కుటిల బుద్ధుల ద్రోచి సజ్జన గోష్టి నుండుట గోరరే దిటముగను
    నెమ్మదిని మీరొం దుటకుఁ క్రీస్తునిఁ జేరరే
    ||యేసు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------