2574) యేసు క్రీస్తుఁడు నిత్య దేవుఁడు ఎఱిగి నమ్ముఁడి

** TELUGU LYRICS **

    యేసు క్రీస్తుఁడు నిత్య దేవుఁడు ఎఱిగి నమ్ముఁడి మనుజులారా మోస
    మొందక మోక్షపతికిఁక దాసులై బ్రతుకండి రండి 
    ||యేసు||

1.  ఆరు దినములలోపలనే యాకసము భూలోకములను ప్రాకటముగఁ
    జేసి నాఁడు ప్రకాశుఁడాయన ప్రజ్ఞవంతుఁడు
    ||యేసు||

2.  ఆది పురుషుని యాదిస్త్రీనిఁక హస్తములతో నంటి చేసెను మేదినిన్
    ఫలవనములో న సాధులై నివసింప నిచ్చెను
    ||యేసు||

3.  వార లిద్దపు దేవునాజ్ఞను కోరికలతో మీరినప్పుడు గారడీ పిశాచ తంత్రము
    వారి పరమై పాపులైరి
    ||యేసు||

4.  వీరలందఱు వారి సంతతి వేరెలేరీ ధరణిలో దు ష్యార్యులై దేవుని
    యాజ్ఞలు మీరి రందఱు నరక పాత్రులు
    ||యేసు||

5.  ఇంత పాపభరితులై కా సంతసత్యము లేని నరుల నెంతగాఁ బ్రేమించెనో
    తన సొంత ప్రాణముఁ బలిగఁబెట్టెను
    ||యేసు||

6.  పాపమించుకలేని కరుణా పావనుడు నరుఁడాయెను శాపగ్రస్తులమైన
    మన శాపములు తాఁజేతఁ బూనెను
    ||యేసు||

7.  ఎన్నరాని బాధలొందుచు పుణ్యరక్తము జిందెనిలను ఎన్నఁడు నీలాటి
    ప్రేమ వన్నెలేదో యన్నలారా
    ||యేసు||

8.  మనలఁ బాపమునుండి బాపను మనుజుఁడై మరణంబునొంది మన
    ప్రభువె మూఁడవ దినంబున మహినిలేచి పరము వెళ్లెను
    ||యేసు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------