2589) యేసు దేహము సంఘము ప్రభు క్రీస్తుపై

** TELUGU LYRICS **

    యేసు దేహము సంఘము ప్రభు క్రీస్తుపై వి శ్వాస మమరి క్రా లెడు
    జనము యేసు ప్రాయశ్చిత్త రక్తము దోసములను బాపు నంచు నాసతోడ
    నమ్మి తమ ప్ర యాసములను దీర్చుకొన్న 
    ||యేసు||

1.  స్థాపకుఁడు యెహోవా దేవుఁడు పాపులను గావ నోపి సుతునిఁ బంపె
    కరుణుఁడు ఈ పవిత్ర సంఘమునకు దీపము పరిశుద్ధ వేద మేపుమీఱు
    శిరసు క్రీస్తు కాపుకర్త పావనాత్మ
    ||యేసు||

2.  వరుఁడు క్రీస్తు యేసునాధుని మురువంపు వధువై పరఁగు నహ
    విశేషఖ్యాతిని సరిగెపట్టు నారచీర లరయ నీతి న్యాయము లవి యురుతరా
    భరణముల సుం దరము భక్తి వర్తనంబు
    ||యేసు||

3.  తన యమూల్య రక్తముఁ దెచ్చి యనురక్తుఁ డీమె కనిశ శుల్క దా
    నమునిచ్చి ఘనుఁ డగు నా పావనాత్మ తనకుఁ దోడుజేసి మంచి పని
    తనమున నీమె కొక్క భవనముఁ గట్టంగఁ బోయె     
    ||యేసు||

4.  మరణ విజయుఁ డైన వీరుఁడు మహాబ్రములపై నరుగుదెంచు మహిమ
    శూరుఁడు నిరతప్రేమ కాముఁ డీమె కరముబట్టి పెండ్లి యాడఁ ద్వరగ
    వచ్చుఁ గాన భక్తి పెరుగు బ్రతుకు టుత్తమంబు
    ||యేసు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------