2840) యేసూ ఆత్మ ప్రియుడా నిన్ను నాశ్రయించితి

** TELUGU LYRICS **

1.  యేసూ, ఆత్మ ప్రియుడా - నిన్ను నాశ్రయించితి
    లేవగా దరంగముల్ - గాలివాన కొట్టగా
    జీవ బాధలన్నిటన్ - నన్ను దాచు రక్షకా
    నన్ను నడ్పి రేవునన్ - ఆత్మ జేర్చుమీ తుదన్

2.  దిక్కులేని యాత్మకు - వేరే ప్రాపు లేదిక
    నొంటిగాను విడ్వక - నన్ను యాదరించుమీ
    నిన్నే నమ్మియుంటిని - నీవే నా సహాయము
    కాపులేని నా తలన్ - నీదు రెక్క క్రమ్మనీ

3.  క్రీస్తు నిన్ను గోరుదున్ - దొర్కునన్ని నీకడన్
    పడ్డహీను నెత్తుమీ - స్వస్థపర్చు రోగులన్
    న్యాయ శుద్ధ నామము - నీదే నేను పాపిని
    నేను పాపపూర్ణుడన్ - నీవు ప్రేమరూపివి

4.  పాపమెల్ల మాంపగా - నీదు ప్రేమ చాలును
    మాంపు నీళ్ళు నా యెదన్ - శుద్ధిచేయగా నిమ్ము
    నీవు జీవపూటవు - త్రాగనిమ్ము నీదరిన్
    పుట్టి నాదు నాత్మలో - నెల్ల వేళ పారుమీ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------