2651) యేసే నా దేవుడు ఆయేసే నాకు సహాయుడు

** TELUGU LYRICS **

    యేసే నా దేవుడు
    ఆయేసే నాకు సహాయుడు
    వ్యాధియైన బాధయైన (2)
    శోధనమరి ఏదైన నిందలెన్ని ఉన్న

1.  ఆది యుందు వాక్కుయై యున్నవాడు
    సర్వ సృష్టికి రూపు నిచ్చినవాడు
    తన రూపంలో నరుని చేసిన వాడే
    నర రూపమెత్తినన్ను రక్షించాడు
    ఆ యేసే. నా దేవుడు
    ||యేసే||

2.  వ్యాధి బాధలు బాపిన ఆ దేవుడు
    చని పోయిన లాజరును లేపినవాడు
    మరణమును గెలిచిన ఆ మహానీయుడు
    రక్షకుడని రుజువులెన్నో చూపించాడు
    ఆ యేసే. నాదేవుడు
    ||యేసే||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------