2704) యెహోవాను స్తుతించుడి మీరు యెహోవా నామమును స్తుతియించుడి

** TELUGU LYRICS **

    యెహోవాను స్తుతించుడి - మీరు - యెహోవా నామమును స్తుతియించుడి
    అను పల్లవి: యెహోవా సేవకులారా - మీరు స్తుతించుడి

1.  యెహోవా మందిర పునాదిని వేసిన - దినమున పలికిన ప్రవక్తల మాటన్
    నేటి దినమున వినెడి మీరు - ధైర్యము తెచ్చుకొనుడనె ప్రభువు

2.  పూర్ణ మనస్సుతో సేవించు భక్తుల - కరుణతో తన కృప జూపుట మరువని
    నిబంధన నెరవేర్చు నీవంటి దేవుడు - భూమ్యాకాశములందున లేడని

3.  ఇల దావీదను పితరుని తోడ - సెలవిచ్చిన మాట నెరవేర్చెను ప్రభు
    సొలొమోను నందా వాగ్దానములను - కన్నుల విందుగ నెరవేర్చెనుగా

4.  పోవుడి, పోవుడి - తొలగిపోవుడి - అపవిత్రమైన దేని ముట్టకుడి
    యెహోవా సేవోప కరణములను - మోయు వారలగు మీరు శుద్ధి చేసికొనుడి

5.  ఆలకించుడి మీరు తన సేవకుడు - వివేకముగా ప్రవర్తించును గాన
    ఉన్నతమైన స్థానమందుండి - ఘనుడైనవాడై హెచ్చింపబడును

6.  పర్వతములపై ఎంతో సుందరములు - రాజ్య సువార్తను చాటించువారై
    సీయోను! నీ దేవుడేలు చున్నాడని - స మాధానమును ప్రకటించు పాదములు

7.  ఆ నగరములో నుండదు శాపము - దేవుని గొర్రెపిల్ల సింహాసనముండు
    సేవింతురు తన దాసులాయనను - రవి తేజులై దివి రాజ్యమునందు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------