2730) యెహోవ సన్నిధిని నీ స్తోత్రగానముతో

** TELUGU LYRICS **

    యెహోవ సన్నిధిని నీ స్తోత్రగానముతో మహోపకారునకు మానుగ
    నర్పణ సమర్పించుఁడి
    ||యెహోవ||

1.  ప్రభు వడుగు నర్పణలు ప్రేమ కృతజ్ఞతలు అభయ ప్రధానములు
    విభునకు నియ్యుఁడు విరివిగను
    ||యెహోవ||

2.  రిక్తహస్తములతో రావలదు సన్నిధికి భక్తవత్సలునకు శక్తికొలఁది
    మీ రర్పించుఁడి
    ||యెహోవ||

3.  శృంగారాలయ మీలలోఁ పొంగారఁ గట్టుటకు బంగారు వెండి యును
    బాగుగ నియ్యుఁడి ప్రభుపేర
    ||యెహోవ||

4.  వరుమానములచేత వాంఛింప వలదండి గురు నాజ్ఞ చొప్పునను
    విరివిగ హృదయము లర్పించుఁడి
    ||యెహోవ||

5.  యెహోవ జనులారా యియ్యుండి మనసార యెహోవ యిచ్చి నది
    యేసున కర్పణ చెల్లింతము
    ||యెహోవ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------