2692) యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలిసికొంటివి

** TELUGU LYRICS **

    యెహోవా - నీవు నన్ను పరిశీలించి, తెలిసికొంటివి
    నేను కూర్చుం - డుటయు లేచుట
    నీకు తెలియును తలంపు నెరుగుదువు

1.  పరిశీలించి యున్నావు నీవు నా నడక పడకలను
    నా చర్యలన్నిటిని బాగుగా నీవు యెరిగియున్నావు

2.  యెహోవా మాట నా నాలుకకు రాక - మునుపే యెరుగుదువు
    ముందు వెనుకల నన్నావరించి నీ చేతిని నాపై నుంచితివి

3.  నాకు బహుమించియున్నదిట్టి తెలివి - నా కగోచరము
    నీ యాత్మను నీ సన్నిధిని విడిచి యెచ్చటికి - పారిపోవుదును

4.  నే నాకాశమున కెక్కినప్పటికిని నీ - వచ్చట నున్నావు
    పాతాళమందు పండుకొనినను - నీవు అచ్చట నున్నావు

5.  సముద్ర దిగంతములలో నేను వేకువ - రెక్కలు కట్టుకొని
    వసించిన నీదు హస్తము పట్టుకొని - నన్ను నడిపించున్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------