2686) యెహోవా నీ కోపము చేత గద్దింపకుము

** TELUGU LYRICS **

1.  యెహోవా నీ కోపము చేత - గద్దింపకుము - ఆ
    నీదు యుగ్రతచే నన్ను - శిక్షింపకుము

2.  నాలో గట్టిగా నీ బాణములు - నాటి యున్నవి - ఆ
    నా మీద నీ చెయ్యి భార - ముగా నున్నది

3.  నీ కోపముచే నా యారోగ్యము - విడిచిపోయెను - ఆ
    పాపముచే నా యెముకలలో - స్వస్థత లేదు

4.  నా దోషములు నా తలమీద - పొర్లిపోయినవి - ఆ
    నాపై మోయలేని బరువు - వలె నున్నవి

5.  మనోవేదన బట్టి కేకలు - వేయుచున్నాను - ఆ
    కనబడుచున్నది నీకు నా యభి - లాషయంతయు

6.  నా నిట్టూర్పులు నీకు దాచ - బడియుండలేదు - ఆ
    నా గుండె కొట్టుకొని బలము - విడచిపోయెను

7.  నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను - ఆ
    నా పాపమును గూర్చి విచారపడుచున్నాను

8.  నా శత్రువులు చురుకై బలము - కలిగిన వారు - ఆ
    నన్నుచితముగా ద్వేషించు వారు అనేకులు

9.  మేలుకు ప్రతిగా వారు - కీడు - చేయుచున్నారు - ఆ
    మేలు చేసినందుకు వారు - విరోధులైరి

10. దేవా నాకు దూరముగా - నుండకుము ప్రభో - ఆ
     రక్షకా నా సహాయమునకు - వేగమే రమ్ము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------