2681) యెహోవా నా దేవా

** TELUGU LYRICS **

1.  దేవా నీ కృపచొప్పున - నన్ను కరుణింపుము
    కృప చొప్పున నా అతిక్రమ - ములను తుడిచివేయుము
    పల్లవి: యెహోవా నా దేవా

2.  నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము
    నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము

3.  నీకు విరోధముగానే - పాపము చేసియున్నాను
    నీ దృష్టి యెడల చెడు - తనము నే చేసియున్నాను

4.  ఆజ్ఞ యిచ్చునపుడు - నీతిమంతుడవుగను
    తీర్పు తీర్చునపుడు నిర్మలుడవుగ నుందువు

5.  పాపములోనే పుట్టిన - వాడను పాపములోనే
    నాదు తల్లి నన్ను గర్భము ధరియించెను

6.  నీ వంతరంగమున - సత్యము కోరుచున్నావు
    ఆంతర్యములో నాకు జ్ఞనము తెలియజేయుదువు

7.  హిస్సోపుతో శుద్ధీకరించు - పవిత్రుడనగుదును
    హిమము కంటె తెల్లగా నుండునట్లు కడుగుము

8.  ఉత్సాహ సంతోషములు - నాకు వినిపింపుము
    అప్పుడు నీవు విరిచిన - యెముకలు హర్షించును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------