2522) యెడతెగక ప్రార్థించుము మెలకువతో కొనసాగుము

** TELUGU LYRICS **

    యెడతెగక ప్రార్థించుము - మెలకువతో కొనసాగుము

1.  క్రీస్తుని ఉపదేశమును పొంది - ఆయన మాదిరి మదియందుంచి
    ప్రార్థించుము - కౄతజ్ఞతతో - ఆనంద గీతము పాడుచును

2.  ఆయన రాకడ సమీపము - అర్థరాత్రో కూడి కూయునపుడో
    గమనిక లేనివానివలె నుండిన - యజమానుని శిక్షకు గురి యగుదువు

3.  ఉగ్రత నుండి తప్పించు యేసు - ప్రత్యక్షమౌను పరమందుండి
    ఉపద్రవమందు పొందిన రక్షణ కాపాడుకొనన్ నీ ఆత్మయందు

4.  మీరేగదా మాదు నిరీక్షణ - ఆనందమును అతిశయమని
    ప్రేమతో ప్రయాస మొందునట్టి - దైవజనుల పోలి నడువంగను

5.  విశ్వాసమందున్న లోపములను - సరిదిద్దుటకు కృపను పొంద
    ప్రార్థించు సేవకుల ప్రేమను చూచి - వేదనతో వేడు శక్తిని పొంద

6.  ప్రధానదూత శబ్దమును - దేవుని బూర ద్వనిని వినగా
    క్రీస్తునందుండి మృతులైనవారు - లేతురు మొదట మనకన్న ముందు

7.  నిద్రపోక భద్రముగా నుండ - భారముతో వేడుము ప్రభు శక్తిని
    ఎత్తబడరు మత్తులైనవారు - మెలకువతో వేడు ఉజ్జీవాత్మకై

8.  మీ ఆత్మజీవమును రాకడయందు - నిందారహిత సంపూర్ణతతో
    సమాధాన కర్తన్ ప్రార్థించుము - కాపాడబడను పరిశుద్ధతలో

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------