3028) వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును

** TELUGU LYRICS **

    వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును పంతముగఁ
    దన ప్రాణమును పా పులకు నియ్యను వచ్చి సిలువను జచ్చి నను రక్షించె
    నహహా 
    ||వింత||

1.  ప్రీతిగల మా ప్రభుని కృప బహు ప్రియముతోఁ జాటింతును సాధుగా
    నాకొఱకు సిలువను చాల శ్రమల భరించి చావు జ యించి నను రక్షించె
    నహహా
    ||వింత||

2.  పాడుఁడీ మా యేసు ప్రేమను వేఁడుఁడీ మదిఁ గూడుఁడీ పాడుఁడీ
    తన దివ్యరక్తము పాప క్రయముగ నిచ్చి శాపముఁ బాపి నను రక్షించె
    నహహా
    ||వింత||

3.  నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగ నాకియ్యను రక్తస్వేదము
    గార్చె నహహా నరక శాపముఁ ద్రుంచి యాపద నుంచి నను రక్షించె
    నహహా
    ||వింత||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------