3070) విలువైనది నీ కృపా దేశాల హద్దులు దాటింది

** TELUGU LYRICS **

విలువైనది నీ కృపా
దేశాల హద్దులు దాటింది
శిలువైనది నీ ప్రేమా
సంద్రాల లోతును మించింది
నీ కృప నన్ను ఎన్నుకున్నది
యేసు నను ప్రేమిస్తున్నది

ఆపరాధినై నిను చూడక అవివేకినై ఎరుగకా
అపవాది వలలోన పడియుండగా నీ త్రోవనే ఎరుగకా
ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను
ఆ మందసములో జీవపు మన్న
పాపికి ఇచ్చావు నీ కృపలతో

దీనులను ఫలవంతులుగా చేయుచు
శ్రమపడువారిని లేపుచు
దివ్యోపదేసమునందించుచు దివ్వెలగా వెలిగించుచు
దయచూపుమనకుండా దయచూపుచు
దీవరాత్రులు పోషించుచు
దినదినము అడగకనే అక్కర తీర్చావు
నీ కృపలతో

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------