3035) విజయంబు విజయంబు విజయంబు మా యేసు నిజమె మృత్యువు

** TELUGU LYRICS **

    విజయంబు విజయంబు విజయంబు మా యేసు నిజమె మృత్యువు
    గెల్చి నేఁడు వేంచేసె యజమానుఁ డెల్ల ప్ర యాసము లెడఁబాప
    స్వజనుల రక్షింప సమసె సిలువమీఁద 
    ||విజయంబు||

1.  విజయంబు విజయంబు విజయంబు మానవుల వృజిన నివృత్తిని
    విభుఁ డొనరింపన్ గుజనులచే నతఁడు క్రూర మరణము నొంది విజిత
    మృత్యువు నుండి విజయుండై వేంచేసె
    ||విజయంబు||

2.  విజయంబు విజయంబు విజయంబు మా యేసు భుజము మీఁదను
    మోయుఁ బరిపాలనంబు కుజము మీఁదను బ్రాణ త్యజనము జేసెను
    ధ్వజము మోయుచు సిల్వ పాప మోడింతము
    ||విజయంబు||

3.  విజయంబు విజయంబు విజయం బిఁకను మా క పజయము కాకుండఁ
    బ్రభు యేసు క్రీస్తు సుజనత్వమున వైరి వ్రజము గెల్వఁగఁజేసి
    నిజముగఁ బరలోక నిలయంబులో నిల్పు
    ||విజయంబు||

4.  విజయంబు విజయంబు విజయం బనెడి పాట నిజభక్తితో మనము
    నేర్చిన వాని భజియించుదము భూన భములు తాఁ బాలించు అజిత
    జీవ ప్రదుఁ డమరత్వ మిడు మనకు
    ||విజయంబు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------