3111) వేరు చేయజాలునా దూరపరచ జాలునా


** TELUGU LYRICS **

వేరు చేయజాలునా - దూరపరచ జాలునా (2) 
నన్ను నిన్ను - నిన్ను నన్ను (2) 
నిత్యము కొరకై - పెనవేసుకున్న 
ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న
ఈ బంధాన్ని - అనుబంధాన్ని (2) 
||వేరు చేయ||

శ్రమయైన గాని - నిందయైన కాని 
హింసయైన గాని - కరువైనా కాని (2) 
నీ ప్రేమనుండి నన్ను - వేరుచేయ జాలునా 
నీ కృపనుండి నన్ను - దూర పరచజాలునా (2) 
నిత్యము కొరకై - పెనవేసుకున్న 
ఈ బంధాన్ని - అనుబంధాన్ని (2)
||వేరు చేయ||

రోగమైన గాని - మరణమైన కాని 
ఒంటరితనమే గాని - ఓటమైన కాని (2) 
నీ ప్రేమనుండి నన్ను వేరచేయ జాలునా 
నీ కృపనుండి నన్ను - దూరపరచ జాలునా 
నిత్యముకొరకై - పెనవేసుకున్న 
ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న 
ఈ బంధాన్ని అనుబంధాన్ని (2)
||వేరు చేయ||

----------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Maate Chalunaya (నీ మాటే చాలునయా)
----------------------------------------------------------------------------