3101) వెలుగును ఇచ్చే యేసు జన్మించే

** TELUGU LYRICS **

వెలుగును ఇచ్చే యేసు జన్మించే 
ప్రేమను పంచే  క్రీస్తు ఉదయించే (2)
సంబరాలు చేసుకుందాం 
ఊరు వాడా ఈ వార్త చెబుదాం (2) 
||వెలుగును|| 

ఇహ బాధల నుండి విడిపించ వచ్చెను 
పర భాగ్యమునిచ్చి పాలింప వచ్చెను (2) 
తన జీవమునిచ్చి జీవింప చేయ వచ్చెను 
తన శక్తిని ఇచ్చి నడిపింప వచ్చెను (2) 
||సంబరాలు|| 

దుఃఖితులందరిని ఓదార్చగ వచ్చెను 
శ్రమలన్నిటి నుండి తొలగింప వచ్చెను (2)
ధైర్యము ఇచ్చి నిన్ను నడిపింప వచ్చెను 
పూర్ణ శుద్ధి నించి స్వస్థపరచ వచ్చెను (2)
||సంబరాలు|| 

పాపమునుండి నిన్ను కాపాడగ వచ్చెను 
ఘోర పాపినైనా క్షమియింప వచ్చెను (2)
నరకం నుండి నిన్ను తప్పించ వచ్చెను 
పరలోకం ఇచ్చి రక్షింప వచ్చెను (2)

||సంబరాలు|| 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------