3106) వేకువచుక్కల శ్రేష్ఠమౌ దానా!

** TELUGU LYRICS **

1.  వేకువచుక్కల శ్రేష్ఠమౌ దానా!
    మా యిరుల్ బాపి నీ సాయమిమ్ము
    ప్రాగ్దిశ తార దిజ్మండల భూషా
    మా బాలరక్షకు జూపింపుమా.

2.  చల్లమంచాయన తొట్టిపై నొప్పు
    పశులతో భువిబరుండెను
    కున్నెడు నాయన దూతల మ్రొక్కు
    నందర స్రష్ట, రాజు, రక్షణ.

3.  ఆయనకు మంచికాన్కలిత్తమా!
    ఏదోం సువాసనల ద్రివసుల్
    వార్ది ముత్యాల్ కానబోళంబుఖని
    స్వర్ణము నిత్తమా యాయనకు.

4.  నిష్ఫలమే యన్ని శ్రేష్ఠార్పణలు
    కాన్కల నాయన ప్రేమరాదు
    అన్నిట డెందము బీదల మొరల్
    దేవుని కిష్టము లౌకాన్కలు.

5.  వేకువ చుక్కల శ్రేష్ఠమౌదానా
    మాయిరుల్ బాపి నీ సాయమిమ్ము
    ప్రాగ్దిశతార! దిజ్మండల భూషా
    మా బాలరక్షకు జూపింపుమా.

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------