2986) వందనం త్రియేకుడా ఘన మహిమ నీకెగా

** TELUGU LYRICS **

    వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకెగా (2)
    ఏ పాటి వాడను యేసయ్యా, నన్ను కోరుకొంటివే
    ఏ పాటి దానను యేసయ్యా, నన్ను కోరుకొంటి వే 
    ||వందనం||

1.  ఈవులె-న్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి (2)
    నీ పాద సేవ చేయుటకన్నా విలువైన భాగ్యం లేదు (2) నాకూ 
    ||వందనం||

2.  అవసరతలు ఏవైన తీర్చెడి యెహోవా యిరే నీవే (2)
    నా కోరికంతా ఏ క్షణ మైనా నీవేగా నా యేసూ (2) ఆమెన్ 
    ||వందనం||

3.  మా సర్వమంతా నీవే నయ్యా, నీకే గా అంకితం చేసితిమీ (2)
    వేచియున్నాము సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞ పాటించెదమూ (2) స్తోత్రం 
    ||వందనం||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------