3026) వారె మంచి క్రైస్తవులు గదా యీ లోకమందు

** TELUGU LYRICS **

1.  వారె మంచి క్రైస్తవులు గదా యీ లోకమందు వారె మంచి క్రైస్తవులు
    గదా చేరునట్లు చేయుడి. పారమార్థమైన క్రీస్తు సారవాక్య మనుభవించు
    వారి దారి గోరి జేరి భూరిసుఖముఁ బడయునట్టి 
    ||వారె మంచి||

2.  కపట వేష భాష లెల్లను తొలంగఁ ద్రోచి విపుల భక్తి నిపుణు లగుచును
    లపితములు నసత్యములును శపధములును లేక దేవ కృప మనంబులోన
    వెలిగి యుపరిభాగ మరియునట్టి
    ||వారె మంచి||

3.  నమ్మకంబు సుస్థిరంబుగా మనంబులోన సమ్మతంబు గలిగి మెండుగా
    క్రమ్ము కొనెడి శ్రమలయందు సొమ్మసిలక ప్రభుని పా దమ్ములందు
    బుద్ధి నిలిపి నెమ్మది గలవార లెవరో
    ||వారె మంచి||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------