3022) వారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక

** TELUGU LYRICS **

    వారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక
    వారాయనను పెద్దల సమాజములో కీర్తింతురు గాక

1.  దేశనివాసుల చెడుగును బట్టి - నదుల నడవిగ జేసెను
    నీటి బుగ్గల నెండిన నేలగాను మార్చెను

2.  అడవిని నీటిమడుగుగా - మార్చివేసె నెహోవా
    ఎండిన నేలను నీటి - ఊటగాను మార్చెను

3.  పురములు నివాసమునకై - వారేర్పరచుకొనునట్లు
    పొలములలో విత్తనములు చల్లి - ద్రాక్షాతోటలు నాటిరి

4.  సస్య ఫల సమృద్ధి పొందు - నట్లు వాటివలన
    ఆయన ఆకలిగొనిన వారిని - అచ్చట కాపురముంచెను

5.  మరియు ఆయన వాని నధికము - గా నాశీర్వదించగా
    వారి సంతానాభివృద్ధి - అధికముగా వర్ధిల్లెను

6.  వారు విచార బాధ వలన - తగ్గిపోయినపుడు
    రాజులను తృణీకరించి - ఎడారిలో తిరుగజేసె

7.  అట్టి దరిద్రుల బాధను బాపి - వారిని లేవనెత్తెను
    అట్టివారి వంశము మంద - వలె వృద్ధిచేసెను

8.  యధార్థవంతులు దాని - చూచి సంతోషింతురు
    మోసము చేయువారందరు - మౌనముగా నుందురు

9.  బుద్ధిమంతులు యీ విషయ-ముల నాలోచించును
    యెహోవ కృపాతిశయముల - దలంచెదరు గాక

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------