3534) తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్నా

** TELUGU LYRICS **

    తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్నా 
    తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్నా  (2)
    యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ (4)
    తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్నా  
    ||తల్లి ప్రేమ||

1.  ఉన్నతమైనది యేసుని ప్రేమ
    తల్లి ఒడిలో ఒదిగి ఉన్నపుడు 
    వాక్యమనె పాలతో పెంచిన దేవా 
    ముళ్ళ పొదలో చిక్కి ఉన్నపుడు 
    వెదకి రక్షించి కాపాడిన తండ్రి
    నీ ప్రేమకి హద్దులెవరు వేయగలరు యేసయ్యా
    వేవేల నోళ్లతో కొనియాడెదనయ్యా  (2)
    వేవేల నోళ్లతో కొనియాడెదనయ్యా
    ||తల్లి ప్రేమ||

2.  ఏ మంచి లేని నన్ను మిన్నగ ప్రేమించి 
    నీ సిలువ రక్తముతో కొంటివి దేవా
    లోక ప్రేమలన్ని నీటి మూటలవగ 
    శాశ్వత ప్రేమతో పెంచిన దేవా
    నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా  
    ఏమిచ్చి నీ రుణం నే తీర్చెదనయ్యా  (2)
    ఏమిచ్చి నీ రుణం నే తీర్చెదనయ్యా   
    ||తల్లి ప్రేమ||

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post