3160) శుభవార్త వింటిమి యేసు రక్షించును

** TELUGU LYRICS **

1.  శుభవార్త వింటిమి - యేసు రక్షించును
    ఎల్లవారు విననీ - యేసు రక్షించును
    ప్రభుమాట వింటిరె - అది పర్వతంబులన్
    దాటి ప్రకటించుడి - యేసు రక్షించును

2.  ఓడనెక్కి పోవుడి - యేసు రక్షించును
    దైవ భ్రష్టు లెల్లరిన్ - యేసు రక్షించును
    ద్వీపవాసులందరు - వినునట్లు చాటుడి
    దివ్య వర్తమానము - యేసు రక్షించును

3.  ఇహ బాధనుండియు - యేసు రక్షించును
    పరమ భాగ్యమిచ్చును - యేసు రక్షించును
    దీన శ్రేష్టు లెల్లరు - భూనివాసులందరు
    యీ సువార్త వినుడి - యేసు రక్షించును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------