3416) స్తుతులకు పాత్రుండవు సృష్టించినావు రక్షించినావు

** TELUGU LYRICS **

    స్తుతులకు పాత్రుండవు
    సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు

1.  జీవపు రొట్టె వైతివి నీవే - తృప్తిపరచిన ప్రియుడవు నీవే
    గొప్ప కార్యము చేయ - మా సామర్ధ్యము నీవే

2.  లోకమునకు వెలుగు నీవేగా - మా నేత్రముల తెరచితివిగా
    అద్భుతము చేసితివి - మా ప్రకాశము నీవే

3.  ఏకైక ద్వారం మాకిల నీవే - ప్రవేశమిచ్చి రక్షించినావు
    పూర్ణ క్రియ చేసితివి - సంపూర్ణ శాంతి నీవే

4.  మంచికాపరి మాకై నీవిల - ప్రాణంబు నిచ్చి రక్షించితివి
    విడుదల చేసితివి - గొర్రెల నడిపెదవు

5.  పునరుత్థాన జీవంబు నీవే మరణము నుండి దాటించితివి
    విజయంబు నిచ్చితివి - నూతన పరచితివి

6.  మార్గ సత్యము మాకిల నీవే - దుర్బోధ నుండి కాపాడినావు
    చేసితివి ఆత్మకార్యం - ఉన్నత స్థలమందుంచి

7.  నిజమైన ద్రాక్షవల్లివి నీవే - నీ యందు నిలిచే తీగెలు మేము
    లోతైన క్రియ చేసి - ఆత్మ ఫలమిచ్చితివి

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------