3408) స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్

** TELUGU LYRICS **  

    స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి వితతికిన్ కర్తవై వెలయు
    మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు హితుఁడా మా ప్రేమ
    నీ కెట్లు చూపుదుము 
    ||స్తుతియు||

1.  పసిఁడి వర్ణపు టెండ భాగ్య ధారల వాన విసరు మంచి గాలి
    విరియు పుష్పములు రస మొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్ జాటున్
    బ్రసరించు కో తలో పల నుందు వీవు
    ||స్తుతియు||

2.  నెమ్మదిగల యిండ్లు నిజసౌఖ్య కాలములు ఇమ్మహి ఫలియించు
    నైశ్వర్యాధికముల్ ఇమ్ముగ గలిగిన హృదయులమై వంద నమ్ములు
    ఋణపడి యు న్నాము నీకు
    ||స్తుతియు||

3.  దురితంబు లొనరించి దౌర్భాగ్య స్థితి నున్న ధరణికి నీ పుత్రున్
    ధర్మంబు జేసి నరుల కీ ధర్మమున కొరఁత దీర్చెడు సర్వ వరము
    లమర్చిన పరమోపకారి
    ||స్తుతియు||

4.  జీవంబు ప్రేమను జేవఁ గల్గించెడు పావనాత్మను మాకై పంపితివి
    దీవెన లేడు రె ట్లావరింపను మమ్ము నీ విమలాత్మ వా నిని గుమ్మ
    రించు
    ||స్తుతియు||

5.  నరులకు విమోచ నము గల్గె పాపంబుల్ పరిహార మాయెఁ గృ
    పాసాధనముల్ దొరికె మోక్షాంశంబు స్ధిరమాయె మేము నీ కొరకేమి
    తేగలము పరిపూర్ణ జనకా
    ||స్తుతియు||

6.  మాకై వాడుకొనెడి రూకల్ వ్యర్థం బగును నీకై యప్పుగ నిచ్చు నిఖిల
    వస్తువులు శ్రీకరంబగు నిత్య శ్రేష్ఠ ధననిధియై పై లోకంబు నందుండు
    లోపంబు లేక
    ||స్తుతియు||

7.  జీవంబు వస్తువులు శ్రేయస్సు దాన స్వ భావంబు శక్తియు భాగ్యంబులు
    నీవలననే లభ్యమై వెలయుచున్నవి నీ వాసమే మాకు నిత్యానందంబు
    ||స్తుతియు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------