3402) స్తుతియింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా

** TELUGU LYRICS **

    స్తుతియింతుము యేసు ప్రభువా (2) 
    మా స్తుతికి పాత్రుడా (2)
    నిత్యం నిన్నే ఆరాధించి (2) 
    మహిమ పరతుము ఇలలో (2)
    స్తుతికి పాత్రుడా (2)

1.  మా పాపములు మమ్ము నీకు - బహుదూరంబు జేయగా
    ఏ పాపమెరుగని ప్రభువా - మాకై సిలువలో బలియైతివా
    నీ రక్తముతో మమ్ము కడిగి - నీ చెంతకు చేర్చితివా

2.  లోకాశకు లొంగిపోయి - నీ సహవాసమును వీడగ
    ఆకాశమును వీడి మాకై - నీతో సహవాస మొసగితివా
    పరిశుద్ధులుగా మమ్ము తీర్చి - పరమ స్వాస్థ్యము నిచ్చితివా

3.  సాతానుకు దాసులమై - నిత్య మార్గమును వీడగ
    పతనమైన మా బ్రతుకుల్ - నిత్య జీవముగా మార్చితివా
    నిత్యము నిన్నే సేవింప - సత్యవాక్యము నొసగితివా

4.  నిరీక్షణ లేక మేము - నిర్భాగ్యులమై యుండగా
    త్వరగా రానై యున్న ప్రభువా - పరమ నిరీక్షణ నిచ్చితివా
    నీ రాకకై ఎదురు చూడ - సిద్ధపాటును నొసగితివా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------