** TELUGU LYRICS **
స్తుతియించు ప్రభున్ స్తుతియించు నీవు
నా ప్రాణమా నా సమస్తమా
నా ప్రాణమా నా సమస్తమా
1. ఆయన చేసిన ఉపకారములలో
నా ప్రాణమా నీవు మరువకుమా - దేనిన్ - నా
నీ దేవుని నీవు మరువకుమా
నా ప్రాణమా నీవు మరువకుమా - దేనిన్ - నా
నీ దేవుని నీవు మరువకుమా
2. నీ దోషములను మన్నించి వేసి
నీ రోగముల నన్నింటిని - ప్రభు - నీ
కుదుర్చి వేయుచున్నాడు
నీ రోగముల నన్నింటిని - ప్రభు - నీ
కుదుర్చి వేయుచున్నాడు
3. నా ప్రాణమును సమాధి నుండి
విమోచించిన వాడని - ప్రభు - విమో
కరుణా కిరీటము నియ్యన్
విమోచించిన వాడని - ప్రభు - విమో
కరుణా కిరీటము నియ్యన్
4. పక్షిరాజు యౌవనము వలె
నూతన యౌవన ముండునట్లు - నీకు - నూతన
మేలుతో తృప్తిపరచును
నూతన యౌవన ముండునట్లు - నీకు - నూతన
మేలుతో తృప్తిపరచును
5. దీర్ఘశాంతుడు దయగల దేవుడు
యెల్లప్పుడు వ్యాజ్యమాడడు - నీతో - ఎల్లప్పుడు
ప్రతీకారము చేయడు
యెల్లప్పుడు వ్యాజ్యమాడడు - నీతో - ఎల్లప్పుడు
ప్రతీకారము చేయడు
6. భూమికంటె ఎంత ఆకాశమెత్తో
భక్తుల యెడల కృపనంత - తన - భక్తుల
అధికముగా చేసియున్నాడు
భక్తుల యెడల కృపనంత - తన - భక్తుల
అధికముగా చేసియున్నాడు
7. పడమటికి తూర్పెంత యెడమో
పాపములకును మనకంత - మన - పాప
యెడము గలుగ జేసెను
పాపములకును మనకంత - మన - పాప
యెడము గలుగ జేసెను
8. తండ్రి తన కుమారుని యెడల
జాలిపడునట్లు యెహోవా - బహు - జాలి
భక్తులపై జాలిపడును
జాలిపడునట్లు యెహోవా - బహు - జాలి
భక్తులపై జాలిపడును
9. మంటివాడవని ఆయన యెరుగున్
నిర్మింపబడిన విధమెరుగున్ - నీవు - నిర్మి
నీ దేవుడు నిన్ను నెరుగును
నిర్మింపబడిన విధమెరుగున్ - నీవు - నిర్మి
నీ దేవుడు నిన్ను నెరుగును
10. దేవదూతలారా దైవభక్తులారా
యెహోవా మహాసైన్యములారా - ఓ - యెహోవా
హల్లెలూయ పాట పాడుడి
యెహోవా మహాసైన్యములారా - ఓ - యెహోవా
హల్లెలూయ పాట పాడుడి
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------