3377) స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు

** TELUGU LYRICS **

    స్తుతించు - స్తుతించు - ప్రభు యేసునే స్తుతించు (2)
    నిన్ను నిర్మించి రూపంబు నిచ్చిన సృష్టికర్తాయనే (2)
    జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే (2)

1.  ప్రేమించెను నిన్ను ఆయనే - శాశ్వత ప్రేమచే
    ఏర్పరచు కొనె నిన్ను - భూమి పుట్టకమునుపే
    దేవుడే నరరూపియాయె - ఆయన పేరు యేసు ప్రభు
 (2)- ఆయన

2.  యాకోబును సృజియించే - ఇశ్రాయేలుకు రూపునిచ్చే
    నీకు తోడైయుందున్ - భయపడకుమని పలికె
    పేరు పెట్టి పిలిచి - నా సొత్తు నీవనెను - నా సొత్తు నీవనెను

3.  ప్రేమించి నన్ను రక్షించే - స్తుతి చెల్లించి పూజింతున్
    తన రూపము నాకు నిచ్చే - ఆరాధించి ఘనపరతున్
    పరలోక పౌరినిగ చేసెన్ - హౄదయార్పన నర్పింతున్ - 
    హృదయార్పన నర్పింతున్

4.  సహవాసములో నిలిచి - ప్రత్యక్షత యందుండి
    ఏమి సంభవించిననూ - ప్రభు పక్షము నుండవలెన్
    అంతమందు బహుమానమిత్తున్ - అని ప్రభువే చెప్పెనుగా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------