3446) స్తోత్రము స్తోత్రము రక్షణ స్తోత్రము స్తోత్రము

** TELUGU LYRICS **

    స్తోత్రము స్తోత్రము - రక్షణ స్తోత్రము స్తోత్రము
    దేవుని గొర్రెపిల్లకు-స్తోత్రము జేసెద-శ్రీయేసునకు
    స్తోత్రార్డుండగు జయ విజయునకు

1.  దాస్యము బోయెను-యేసు రక్తముచే
    దాస్యము బోయి-స్వతంత్రుడనైతిని

2.  చీకటి తొలగెను-యేసు రక్తముచే
    చీకటి తొలగెను -తేజము వచ్చెను

3.  పాప క్షమాపణ-యేసు రక్తముచే
    పాప క్షమాపణ-పరమానందము

4.  పాపము బాసెను-యేసు రక్తముచే
    పాపము బాసెను-శుద్దుడనైతిని

5.  శాపము బోయెను-యేసు రక్తముచే
    శాపము బోయెను-నీతియు వచ్చెను

6.  సైతానోడెను-యేసు రక్తముచే
    సైతానోడెను-విజయము వచ్చెను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------