** TELUGU LYRICS **
స్తోత్రము పాడి పొగడెదను
దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను
మ్రొక్కి కీర్తించెదను
దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను
మ్రొక్కి కీర్తించెదను
1. అద్భుతమైన ప్రేమ - నాలో పరమతండ్రి చూపు శుద్ధ ప్రేమ
ఎన్నడును మారని ప్రేమ - నాలో నిలుచుండు ప్రేమ
ఎన్నడును మారని ప్రేమ - నాలో నిలుచుండు ప్రేమ
2. జ్యోతిగా జగమునకు - వచ్చి జీవమిచ్చి నన్నుకొన్న ప్రేమ
త్యాగియైన క్రీస్తు ప్రేమ - దివ్య మధుర ప్రేమ
త్యాగియైన క్రీస్తు ప్రేమ - దివ్య మధుర ప్రేమ
3. మాయలోక ప్రేమను - నమ్మి నశించిన నన్ను ప్రేమించెను
నన్ను జయించిన దైవ ప్రేమ - నాలో ఉప్పొంగు ప్రేమ
నన్ను జయించిన దైవ ప్రేమ - నాలో ఉప్పొంగు ప్రేమ
4. ఆధారమైన ప్రేమ - దినము మాతవలె నన్నాదుకొను ప్రేమ
ఉన్నత మహా దైవ ప్రేమ - నన్నాకర్షించె ప్రేమ
ఉన్నత మహా దైవ ప్రేమ - నన్నాకర్షించె ప్రేమ
5. మాట తప్పని ప్రేమ - పరమ వాక్కు నిచ్చి ఆదరించె ప్రేమ
సర్వ శక్తిగల దైవ ప్రేమ - సతతము నుండు ప్రేమ
సర్వ శక్తిగల దైవ ప్రేమ - సతతము నుండు ప్రేమ
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------