** TELUGU LYRICS **
సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు - యేసుని
1. యేసుని రాజ్యము - సమయము వచ్చెను
రక్షణను పొందెదవు - నీవు విశ్వసించిన
రక్షణను పొందెదవు - నీవు విశ్వసించిన
2. మనుజరూపము ధరించి - స్వర్గము దిగి వచ్చెను
తనదు రక్తముద్వారానే - పాపబంధము త్రుంచెను
తనదు రక్తముద్వారానే - పాపబంధము త్రుంచెను
3. కలువరిలోని సిలువలో - ప్రాణము నర్పించెను
ఎల్లరి పాపములకై - తనదు రక్తము కార్చెను
ఎల్లరి పాపములకై - తనదు రక్తము కార్చెను
4. సమయము లేదు సోదరా - త్వరపడి రమ్ము వేగమే
సువార్తను విశ్వసించి - రక్షణను పొందుము
సువార్తను విశ్వసించి - రక్షణను పొందుము
5. పాప సాగరమునందు ఎంతకాలముందువు?
పాపసాగరమునుండి - యేసుప్రభు విడిపించును
పాపసాగరమునుండి - యేసుప్రభు విడిపించును
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------