3336) సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము


** TELUGU LYRICS **

సీయోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెల్లుదము (2)

లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు (2)
పొందవలె నీ లోకమునందు
కొంతకాలమెన్నో శ్రమలు (2)       
||సీయోను||

ఐగుప్తును విడచినట్టి మీరు
అరణ్యవాసులే ఈ ధరలో (2)
నిత్యనివాసము లేదిలలోన
నేత్రాలు కానానుపై నిల్పుడి (2)
||సీయోను||

మారాను పోలిన చేదైన స్థలముల
ద్వారా పోవలసియున్ననేమి (2)
నీ రక్షకుండగు యేసే నడుపును
మారని తనదు మాట నమ్ము (2)
||సీయోను||

ఐగుప్తు ఆశలనన్నియు విడిచి
రంగుగ యేసుని వెంబడించి (2)
పాడైన కోరహు పాపంబుమాని
విధేయులై విరాజిల్లుడి (2)
||సీయోను||

ఆనందమయ పరలోకంబు మనది
అక్కడనుండి వచ్చునేసు (2)
సీయోను గీతము సొంపుగ కలసి
పాడెదము ప్రభుయేసుకు జై (2) 
||సీయోను||

** ENGLISH LYRICS **

Seeyonu Paatalu Santhoshamugaa
Paaduchu Seeyonu Velludamu (2)

Lokaana Shaashvathaanandamemiyu
Ledani Cheppenu Priyudesu (2)
Pondavale Nee Lokamunandu
Konthakaalamenno Shramalu (2)   
||Seeyonu||

Aiguputhunu Vidachinatti Meeru
Aranyavaasule Ee Dharalo (2)
Nithyanivaasamu Ledilalona
Nethraalu Kaanaanupai Nilpudi (2)
||Seeyonu||

Maaraanupolina Chedaina Sthalamula
Dvaaraa Povalasiyunnanemi (2)
Nee Rakshakundagu Yese Nadupunu
Maarani Thanadu Maata Nammu (2) 
||Seeyonu||

Aiguputhu Aashalananniyu Vidichi
Ranguga Yesuni Vembadinchi (2)
Paadaina Korahu Paapambumaani
Vidheyulai Viraajilludi (2)
||Seeyonu||

Aanandamaya Paralokambu Manadi
Akkadanundi Vachchunesu (2)
Seeyonu Geethamu Sompuga Kalasi
Paadedamu Prabhuyesuku Jai (2)
||Seeyonu||

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------