3303) సిల్వలో సిల్వలో పాపమెల్ల బోయె సిల్వయందున

** TELUGU LYRICS **

1.  పాపభారము దుష్టగుణ సమేతుండనై
    దుఃఖనష్ట దౌర్జన్యముతో నుండ
    చిన్న స్వరము వినబడె నన్ను పిలుచునట్లుగా
    రమ్ము పొందు నాదుసిల్వ విశ్రాంతి
    పల్లవి: సిల్వలో సిల్వలో - పాపమెల్ల బోయె సిల్వయందున
    భారమెల్ల వీడెను - రాత్రి పగలాయెను
    కనుగొంటి సిల్వలో రక్షణ

2.  ఏగుచుందు నిత్యము జీవమును బొందను
    సిల్వలో కృపశక్తి పొందుదున్
    శోధనలు వచ్చిన జయ మొందుచుందును
    మోకరించి ప్రార్థింతు సిల్వచెంత

3.  జీవితమందు ఏడ్పు బాధ శోధన్లలెల్ల
    ఆత్మసాయముచే సిల్వజూతును
    యేసు పాపికొరకుపడ్డపాట్లు చూడగా
    భారముల మోయుశక్తి పొందుదున్

4.  భారముచే క్రుంగిన పాపీ నేడే రారమ్ము
    యేసు రక్తమందు నిన్ను కడుగును
    నిత్యజీవ మిచ్చును నిన్ను సమర్పించుకో
    క్రీస్తు యేసు క్రొత్త శక్తి నిచ్చును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------