3329) సిలువే నీ గురిగా నడువు యౌవనుడా

** TELUGU LYRICS **

    సిలువే నీ గురిగా - నడువు యౌవనుడా
    వెనుకంజ వేయకయే - నిలువు యేసు బండ పై

1.  మునుగు చుండె - నీ జీవనావ దాటించు వారెవ్వరు?
    యేసు ప్రభుండే - దాటించువాడు నీదు చుక్కాని యేసే

2.  వచ్చెను యేసు - ఈ లోకమునకు తెచ్చె నీకు రక్షణ
    అక్షయుడు తెరచె - నిశ్చయముగ మోక్షద్వారము నీకే

3.  సిలువలో యేసు నీ పాపములకై రక్తము కార్చెను
    విమోచించును విశ్వసించిన - ముక్తిని పొందెదవు
.
4.  ప్రేమవార్త ప్రకటింప బడెను ప్రియులారా రండి నేడే
    మీ ఉల్లములకు ప్రియమైన యేసే శాంతి నిచ్చెడి రాజు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------