3325) సిలువలో వ్రేలాడు ప్రభువే విలువ కందఁగ రాని యీవుల నెలమి

** TELUGU LYRICS **

    సిలువలో వ్రేలాడు ప్రభువే విలువ కందఁగ రాని యీవుల నెలమి
    మనకై కొనియెఁగల్వరి నిపుడు సాష్టాంగము లొనర్చుచు 
    ||సిలువ||

1.  కొరత చావయినను మరణము వఱకుఁదనుఁ దగ్గించుకొని మన కొఱకు
    దాసుండగుచు రిక్తుని కరణి నిట జీవము నొసంగెడు
    ||సిలువ||

2.  తనను నమ్మినవారు చావక యనిశ జీవమునొంది బతుకను దన
    స్వపుత్రుని నిచ్చునంతఁగఁ దండ్రి ప్రేమించెను జగంబును
    ||సిలువ||

3.  పాప మెఱుగని వాని మనకై పాపముఁగ నొనరించి దేవుఁడు
    శాపగ్రస్తులలోన నొకఁడుగ మా ప్రభుండెంచంగఁ బడియెను
    ||సిలువ||

4.  లోకమాంస పిశాచులని యెడి భీకారుల పొంగుఁ గృంగను శ్రీ కరుఁ
    డు మన దేవతనయుం డౌ కృపానిధి దీనుడయ్యెను
    ||సిలువ||

5.  ఘోరయుద్ధముఁ జేసివైరిని గూలఁద్రోసిన తావిదే మన పారమార్ధిక
    బలము కిరువగు ధీర శ్రేష్ఠుఁడు దిశలు ఘళ్లన    ||సిలువ||
    దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెలవిచ్చెను

6.  శరణు గలదిఁక పాపకోటికి స్వామి ద్రోహపు శత్రులకు సహ కరుణ
    రుధిర కణాగతంబున కలుష రహిత మనంత రక్షణ
    ||సిలువ||

7.  మాకు ప్రేమ సారమయ్యెను మాకు జీవనాధారమయ్యెను మాకుఁ
    దృప్తి సునీరమయ్యెను మాకుఁ బరమ విచారమయ్యెను
    ||సిలువ||

8.  నమ్ముదము సైన్యముల ప్రభువును చిమ్ముదము సందియము లాత్మను
    క్రమ్ముదము మోక్షపురి బాట సు ఖమ్ము మన హృదయమ్ము లొందను
    ||సిలువ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------