3118) శక్తిగల షాలేము రాజా షారోను రాజా

** TELUGU LYRICS **

    శక్తిగల షాలేము రాజా షారోను రాజా
    స్తుతియించెదము యేసు

1.  పూర్వమున పల్కిన నీ ప్రవచవోక్తులన్ని
    చక్కగను మక్కువతో చేసితివి నీవు - చేసితివి నీవు
    పూర్వమున చూపిన నీ ప్రత్యక్షతలన్ని - వరుసగను జరిపితివి నిన్ను
    పోలినవాడు వేరెవ్వరు లేరు

2.  బయలు పరచినట్టి నమూనాను పోలి నాడు
    బలముగను నీదు ప్రత్యక్ష గుడారమును - నీ గుడారమును
    కట్టితివి నీ దాసుడై నట్టి మోషే ద్వారా
    నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను - ప్రభావ మహిమను

3.  షాలేము యెసూషలేములోని ఆలయము
    సొలొమోను ద్వారా కట్టించిన మహారాజా - కట్టించిన రాజా
    ఆలయమును నిర్మించినట్టి మహారాజా
    నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను - ప్రభావ మహిమను

4.  కాలము సంపూర్ణముగ పరిణమించగానే
    కన్య గర్భమున ప్రభో జన్మించితి వీవు - జన్మించితి వీవు
    కట్టెదను నా సంఘము నని సెలవిచ్చి
    కట్టుచున్నావు మమ్ముల నీ స్వరూపమునకు - నీ ఆలయముగను

5.  హస్తకృతాలయములో వసించని నీవు
    వింతగాను మా మధ్యను ఉండగోరినావు - ఉండగోరినావు
    కాంతివంతమైన నీదు మహా మహిమతోనే
    స్వంత వారినంత నింప తీర్మానించినావు - తీర్మానించినావు

6.  అక్కడను ఇక్కడ నొక్కొక్కరిని యేరి
    అద్భుతముగను జత చేయువాడ వీవు - చేయువాడ వీవు
    నూతన దంపతులను వింతగా దీవించి
    అంతకంతకు వర్ధిల్ల జేయువాడ వీవే - కాయువాడ వీవే

7.  వ్యక్తులను కుటుంబములనుగా మార్చివేసి
    శక్తిగల సంఘ వధువుగ మార్చివేసి - నీవే మార్చివేసి
    వింతగా నా వధువునకు వరుండవై నావు
    ఆంతము లేదహా నీ మహిమ రాజ్యమునకు - హల్లెలూయా ఆమెన్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------