** TELUGU LYRICS **
సర్వశక్తుఁడ నిర్మలాత్ముఁడ సర్వజన సంరక్షకా మా సర్వపాపముఁ
బరిహరింప నీ సర్వమహిమను విడితివా
బరిహరింప నీ సర్వమహిమను విడితివా
||సర్వ||
1. నిత్యనాశనమగ్నులగుమా నిత్యశాపముఁ బాపి మరి నీ నిత్య జీవము
మాకునీయను మృత్యు బాధలు పడితివా
||సర్వ||
2. పాపమరణపు బంధకములనుఁ దెంపి మము విడిపించుటకు మా
పాపమును భరించి మాకై యాపదల పాల్పడితివా
2. పాపమరణపు బంధకములనుఁ దెంపి మము విడిపించుటకు మా
పాపమును భరించి మాకై యాపదల పాల్పడితివా
||సర్వ||
3. మెట్టుకీబలు దుష్టులనుచే పట్టి జీవము నిచ్చితివి కా బట్టి యిఁక నీ
కట్టడలలో దిట్టముగ బలపరుచుమీ
3. మెట్టుకీబలు దుష్టులనుచే పట్టి జీవము నిచ్చితివి కా బట్టి యిఁక నీ
కట్టడలలో దిట్టముగ బలపరుచుమీ
||సర్వ||
4. సత్యవిధులలో నడువనే న శక్తుఁడనో రక్షకా నీ భృత్యునికి శక్తి నిత్యమిడి
నడి పింపు నీ ఘనసేవలో
4. సత్యవిధులలో నడువనే న శక్తుఁడనో రక్షకా నీ భృత్యునికి శక్తి నిత్యమిడి
నడి పింపు నీ ఘనసేవలో
||సర్వ||
5. నీదు నామము మహిమపరుచను నాదు జీవితకాలమున బహు
సాధు నిగ ననుఁ జేసి సాయము నాధుఁడా నాకీయుమా
5. నీదు నామము మహిమపరుచను నాదు జీవితకాలమున బహు
సాధు నిగ ననుఁ జేసి సాయము నాధుఁడా నాకీయుమా
||సర్వ||
6. ప్రస్తుతము పరదేశినై ప్రచురంబుఁజేతు నీ స్తోత్రముల్ పర వస్తు
ఘనరాజ్యంబుకొరకై వాస్తవముగ నిరీక్షింతున్
6. ప్రస్తుతము పరదేశినై ప్రచురంబుఁజేతు నీ స్తోత్రముల్ పర వస్తు
ఘనరాజ్యంబుకొరకై వాస్తవముగ నిరీక్షింతున్
||సర్వ||
7. ముక్తినుంచి నీవు రాగా శక్తితోఁ ప్రభు యేసువా యా సక్తితో నినుఁ
గూడుకొని బహు యుక్తస్తోత్రముల్ జేతుము
7. ముక్తినుంచి నీవు రాగా శక్తితోఁ ప్రభు యేసువా యా సక్తితో నినుఁ
గూడుకొని బహు యుక్తస్తోత్రముల్ జేతుము
||సర్వ||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------