3244) సర్వముపై యేసు రాజ్యమేలున్ పాపి మిత్రుడు గొఱ్ఱెపిల్లకు

** TELUGU LYRICS **

1.  సర్వముపై యేసు రాజ్యమేలున్
    పాపి మిత్రుడు గొఱ్ఱెపిల్లకు
    మన మొరవిన కిరీటము
    నిచ్చి హెచ్చించె దేవుడాయనన్
    పల్లవి: సర్వముపై సర్వముపై - సిల్వవేయబడినట్టివాడే
    పాదములబడి పూజింతుము - సర్వముపై హెచ్చించె దేవుడు

2.  తుఫాను భయంకరాలచే
    కొట్టునప్పుడు మొఱ పెట్టగా
    యేసును వేడగా నా చేతితో
    పట్టి శిలలపై నడ్పించును

3.  పట్టణము లతిగొప్పవైనన్
    అడ్డములు బలమైనపుడున్
    నిర్భయముగ సాగుచుందుము
    సర్వముపై నున్న వాని ద్వారా

4.  ధృవము నుండి ధృవం వరకు
    యుగములనుండి శాశ్వతముగ
    సర్వముపై ననుభవింతుము
    వీరులై యేసు వెంట సాగుచు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------